Friday, May 3, 2024

స్పీడ్ పెంచిన నాగ శౌర్య…

హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్య సినిమా చేస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నాగ్ శౌర్య సరసన కేతిక శ‌ర్మ నటిస్తుంది. మరోవైపు విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ శౌర్య సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ పనులను జరుపుకుంటోంది. అలాగే మిగిలినపనులన్ని కూడా పూర్తి చేసి వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement