Saturday, April 27, 2024

డిసెంబర్ లో ‘లక్ష్య’..

ప్ర‌భన్యూస్ : డిసెంబర్‌ నుండి వరుసగా కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. భారీ చిత్రాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా థియేటర్లలో అలరించనున్నాయి. సినిమాల మధ్య కొంత గ్యాప్‌ ఉండేలా నిర్మాతలు ప్లాన్‌ చేసుకుంటున్నారు. తాజాగా నాగశౌర్య నటిస్తున్న 20వ చిత్రం ‘లక్ష్య’ విడుదల తేదీని ప్రకటించారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా, క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 10న విడుదల కానున్న‌ట్టు చిత్ర బ్రుందం తెలిపింది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదలచేసిన ప్రత్యేక పోస్టర్‌లో నాగశౌర్య లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఇక సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్‌ కార్యక్రమాలను కూడా పెంచేందుకు చిత్ర యూనిట్‌ సిద్దమైంది.

విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగశౌర్య.. ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పుస్కర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చగా.. రామ్‌ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement