Saturday, April 20, 2024

13జిల్లాలు.. నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండ‌ళ్లు.. జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం..

త్వ‌ర‌లోనే 13జిల్లాల కోసం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండ‌ళ్లు ఏర్పాటు కానున్నాయి ఏపీలో. ఈ మేర‌కు వైసీపీ స‌ర్కార్ సిద్ధ‌మ‌యింది. మూడు రాజధానులని రద్దు చేసిన నేపథ్యంలో మండళ్ళని ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారట. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కోసం అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కోసం విశాఖ కేంద్రంగా ఒక మండలి ఏర్పాటు కానుంది. ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాల కోసం రాజమండ్రి వేదికగా మరో మండలి ఏర్పాటు చేయనున్నారు.

ఇక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ అభివృద్ధి మండలి ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు కర్నూలు కేంద్రంగా మరో మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయా జిల్లాల్లోని అభివృద్ధి వ్యవహారాలు మొత్తం ఈ మండళ్ల ద్వారానే నిర్వహించే విధంగా మండలి పాలక వర్గాల రూప కల్పన జరుగుతోంది. ఈ మండళ్ళ ఛైర్మన్ బాధ్యతలని స్థానికంగా ఉండే సీనియర్ నేతలకు అప్పగించనున్నార‌ని స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement