Monday, April 29, 2024

Anasuya: కెటిఆర్ సార్ ..మీ కృషికి ధ‌న్య‌వాదాలుః అన‌సూయ‌

తెలంగాణ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది యాంకర్ క‌మ్ న‌టి అన‌సూయ‌. కాంగ్రెస్ గెలుపే నేప‌థ్యంలో కాంగ్రెస్ట్ పార్టీకీ శుభాకాంక్షలు తెలిపారు కెటిఆర్. దాంతో కేటీఆర్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని నటిగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ కూడా స్పందించింది.

కేటీఆర్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఆసక్తికరమైన నోట్ రాసుకొచ్చింది. సార్, మీరు నిజమైన నాయకులు. ఎందరికో స్ఫూర్తినిచ్చారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి కూడా చూడాల్సిన అవసరం మీకు ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధికి ధన్యవాదాలు. అన్నిట్లో హైదరాబాద్‌ను పురోగతి సాధించేలా చేసినందుకు నగరంతో ప్రేమలో పడ్డాను!’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement