Tuesday, May 14, 2024

కృష్ణ బర్త్ డేకి నో అప్డేట్…సర్కారు వారి పాట టీం క్లారిటీ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ రాబోతుందని గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఆ రోజున ఎలాంటి ఫస్ట్ లుక్ లాంచ్ లేదని దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఎవరు ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేయవద్దని సూచించారు. కాగా ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement