Monday, April 29, 2024

బాలయ్య అఖండ పై ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్!!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అదేస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్ హీరో శ్రీకాంత్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. బాలయ్య అఘోర పాత్ర అనేది ఓ రోల్ లా కాకుండా చాలా ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఈ చిత్రంలో బాలయ్య చెప్పే డైలాగ్స్ తో థియేటర్లు దద్దరిల్లి పోవడం ఖాయమని తెలిపారు. ఇక బాలయ్య అభిమానులు ఈ విషయం తెలిసి మరింత అంచనాలను పెంచేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ,పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement