Monday, April 29, 2024

Dune 2: హాలీవుడ్ లో ఖ‌లేజా…క‌లెక్ష‌న్స్ సునామీ.

కొన్ని చిత్రాలు కథలు అద్భుతంగా ఉన్నా తెరకెక్కించిన విధానం వల్ల ఫ్లాప్ అవుతుంటాయి. ఆ కోవకి చెందిన చిత్రమే మహేష్ బాబు ఖలేజా. ఈ చిత్ర కథలో ఎలాంటి లోపం లేదు. కానీ త్రివిక్రమ్ ఈ కథని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యారు. కానీ ఇదే కథతో మార్చి 1న విడుదలైన ఒక హాలీవుడ్ చిత్రం దుమ్ములేపుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆ చిత్రం పేరు డ్యూన్ 2.

తిమోతి ఛాల్మెట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఖలేజా కథ ఈ చిత్రంలో అచ్చు గుద్దినట్లు ఉందని చెప్పలేం కానీ దాదాపు రెండు చిత్రాల కథ ఒకటే. ఖలేజా చిత్ర కథ ఏంటో అందరికి తెలుసు. డ్యూన్ 2లో తండ్రిని కోల్పోయిన హీరో తిమోతి తన తల్లితో కలసి అకీరాస్ గ్రహంలోని ఫ్రెమేగ్ అనే తెగ ప్రజల దగ్గరికి చేరుకుంటాడు. ఫ్రెమేగ్ తెగ ప్రజలు ఆ సమయంలో ఒక ఆపదలో ఉంటారు. తమని రక్షించే దేవుడి కోసాం ఎదురుచూస్తుంటారు. మిమ్మల్ని రక్షించే రక్షకుడు తన కొడుకే అని పాల్ అట్రిడియాస్ (తిమోతి) తల్లి ఆ ప్రజలకు చెబుతుంది. కానీ పాల్ కి ఆ ప్రజలపై అసలు ఆసక్తి ఉండదు. కానీ అకీరాస్ గ్రహంతో ఎంతో విలువైన ఒక డ్రగ్ దొరుకుతుంది. దానిని దక్కించుకోవడానికి విలన్ తన ఆర్మీతో ప్రయత్నిస్తుంటాడు. ఫ్రెమేగ్ తెగని అంతం చేసి ఆ డ్రగ్ ని పొందాలని అనుకుంటాడు. పాల్ తండ్రిని చంపింది కూడా విలనే. ఇక హీరోఫ్రెమేగ్ తెగకి రక్షకుడిగా మారాడా ? తన తండ్రి చావుకు పగ తీర్చుకున్నాడా అనేది మిగిలిన కథ.

- Advertisement -

ఖలేజా చిత్రంలో కూడా ఊరి ప్రజలని నాశనం చేసి అక్కడ దొరికే విలువైన ఖనిజాన్ని దోచుకోవాలని విలన్ ప్రయత్నిస్తుంటాడు. తమని రక్షించే దేవుడు నువ్వే అని ఊరి ప్రజలు మహేష్ కి చెప్పినా అతడు పట్టించుకోడు. ఇదే తరహా కథతో వచ్చిన డ్యూన్ 2 హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. క్రిటిక్స్ నుంచి కూడా యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. డెనిస్ విలీనవ్యూ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విజువల్ వండర్ గా ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ లో క‌లెక్ష‌న్స్ దుమ్ముదులిపేస్తున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement