Thursday, July 25, 2024

AP | టీటీడీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్ పోస్టుల భర్తీ

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో డిగ్రీ లెక్చరర్ 49 పోస్టులు, జూనియర్ లెక్చరర్ 29 పోస్టులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 7 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement