Wednesday, October 16, 2024

WPL | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న యూపీ..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా మహిళలు మరో రసవత్త పోరుకు సిద్ధమయ్యారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

ఇక వరుస పరాజయాతో పాయింట్స్ టేబుల్‌లో వెనుకబడిన ఆర్‌‌సీబీ.. ఈ మ్యాచ్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు, గత రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి జోరు మీదున్న యూపీ వారియర్స్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తమ విన్నింగ్ స్ట్రీక్‌కు కొనసాగించాలని చూస్తోంది. ఇక బెంగళూరు వేదికగా జరగనున్న చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

ఆశా శోబన, ఎల్లీస్ పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్ (wk), స్మృతి మంధాన (c), సోఫీ డివైన్, సిమ్రాన్ దిల్ బహదూర్, జార్జియా వేర్‌హామ్, సబ్బినేని మేఘన, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్

యూపీ వారియర్స్ :

- Advertisement -

అలిస్సా హీలీ (c మరియు wk), చమరి అతపత్తు, కిరణ్ ప్రభు నవ్‌గిరే, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, పూనమ్ ఖేమ్‌నార్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గయాక్‌వాడ్, అంజలి సర్వాణి, సాయి

ఇక ఈ మ్యాచ్ అనంతరం మిగిలిన మ్యాచ్‌లు ఢిల్లీలోని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జ‌ర‌గ‌నున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది. పట్టికలో రెండు, మూడవ స్థానంలో నిలిచిన‌ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు మార్చి 17న జరగనున్న ఫైనల్స్ ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement