Monday, April 29, 2024

కేజీఎఫ్ 2 ఆడియో రైట్స్ వారికే!! ఎంత ధర పలికిందో తెలుసా ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం కేజీఎఫ్ 2 తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేజిఎఫ్ చాప్టర్ 2 కి సంబంధించి సౌత్ ఇండియా ఆడియో రైట్స్ ను 7.2 కోట్ల రూపాయలకి గాను లహరి మ్యూజిక్ మరియు టి సిరీస్ లు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే సినిమాను కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement