Thursday, May 2, 2024

కే జి ఎఫ్ చాప్టర్2 నెంబర్ వన్… మాస్టర్ నెంబర్ 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజీఎఫ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2తెరకెక్కుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి.

కాగా తాజాగా ఈచిత్రానికి సంబంధించిన సౌత్ ఆడియో రైట్స్ 7.2 కోట్ల కి అమ్ముడుపోయాయి. అయితే ఇది సౌత్ ఇండియా సినిమాలోనే హైయెస్ట్ అట. దీనికి ముందు విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమా నాలుగున్నర కోట్లు పలుకగా మూడవ స్థానంలో కే జి ఎఫ్ చాప్టర్1 నిలిచింది. అయితే మున్ముందు ఈ రికార్డును ఏ సినిమా అయినా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement