Sunday, April 28, 2024

Kirthi, Radhika :వెబ్ సిరీస్ లో కీర్తీ సురేష్… రాధికా అప్టే

ఆదిత్య చోప్రా నిర్మాతగా ధర్మరాజ్ శెట్టి డెబ్యూ డైరెక్టర్ గా ‘అక్క’ వెబ్ సిరీస్ తీస్తున్నారు.. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను మేకర్స్ ప్రస్తుతానికైతే రహస్యంగానే ఉంచుతున్నారు.

ఎటువంటి విషయం రివీల్ చేయడం లేదు. అయితే సహజ సిద్ధమైన నటనతో మెప్పించే హీరోయిన్లలో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఇందులో న‌టిస్తున్నారు… పాత్ర ఏదైనా.. పోటాపోటీగా నటించే వీరిద్దరూ కలిసి ‘అక్క’ అనే ప్రాజెక్ట్‌లో చేస్తుండటంతో సహజంగానే ఈ సిరీస్‌పై అంచనాలు మొదలయ్యాయి.. ఈ వెబ్ సిరీస్ పై బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement