Saturday, April 27, 2024

ప్రభాస్ సినిమాలో కత్రినాకైఫ్!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడని… అందులో శ్రీనిధి శెట్టి ఆడిపాడనుందని మొన్నటివరకు టాక్ నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. కత్రినాకైఫ్ ను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్లు వినికిడి. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కే జి ఎఫ్ సినిమాలో తమన్నా తో ఐటెం సాంగ్ చేయించాడు ప్రశాంత్ నీల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement