Saturday, April 27, 2024

అమీర్ ఖాన్ విడాకులపై కంగనారనౌత్ హాట్ కామెంట్స్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక వివాదంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కాగా తాజాగా అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు విషయంపై కంగనా రనౌత్ తన దైన శైలిలో స్పందించింది. ఈ విడాకులకు కారణం కులాంతర వివాహమే అని నాకు అనుమానంగా ఉంది. కిరణ్ రావు హిందూ మతానికి చెందినది అయినప్పుడు అమీర్ ఖాన్ తన కొడుకును ఎందుకు హిందువుగా పెంచలేదు అంటూ ప్రశ్నించింది కంగనా.

కిరణ్ రావు వివాహం తర్వాత ఇస్లామిక్ లోకి ఎందుకు మారిపోయింది. ఆమె హిందూమతాన్ని ఎందుకు కొనసాగించలేదు. వారి విడాకుల విషయంలో కులాంతర వివాహం కీలక పాత్ర పోషించింది అనిపిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయంపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement