Saturday, May 18, 2024

రగడ్ లుక్ లో కమల్, సేతుపతి, ఫహాద్

కమల్ హాసన్ హీరోగా మాస్ట‌ర్ సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న మూవీ విక్రమ్.. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఆ పోస్ట‌ర్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి, మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ కూడా ఉన్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ ఇప్పుడు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఒక‌వైపు విజ‌య్ సేతుప‌తి.. మ‌రోవైపు ఫ‌హాద్ ఫాజిల్ ఉండ‌గా.. మ‌ధ్య‌లో క‌మ‌ల్ హాస‌న్ ఉన్న ఈ పోస్ట‌ర్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. పోస్ట‌రే ఈ రేంజ్‌లో ఉంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

కమల్ హాసన్ ఇండియ‌న్ 2 సినిమాకి బ్రేక్ ప‌డింది. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న విక్రమ్ మూవీపై ఫోకస్ చేశారు. ఖైదీ, మాస్టర్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్‌ చేస్తున్న సినిమా విక్ర‌మ్‌. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ‘విక్రమ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విజయాలు లేని కమల్ హాసన్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి: ఎవరు మీలో కోటీశ్వరుడు… సెట్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement