Sunday, April 28, 2024

ఎవరు మీలో కోటీశ్వరుడు… సెట్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్1 కు హోస్ట్ గా బుల్లితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. నటుడిగానే కాకుండా హోస్ట్ గా కూడా తానేమీ తక్కువ కాదంటూ నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సెకండ్ టీవీ షోకు రెడీ అవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.

ఈ ప్రోగ్రాం కు సంబంధించి ప్రోమో లో ఇప్పటికే ఎన్టీఆర్ నటించారు. కాగా శనివారం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో షూటింగ్ కు ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన షూటింగ్ ఈ నెల 20 వరకు జరగబోతుందట. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement