Monday, April 29, 2024

విక్రమ్ ఫస్ట్ లుక్ @నయా రికార్డ్

స్టార్ హీరో కమల్ హాసన్, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కనిపించారు. ముగ్గురు కూడా సీరియస్ లుక్ లో దర్శనమిచ్చారు.

అయితే ప్రస్తుతం విక్రమ్ ఫస్ట్ లుక్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాను కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అలాగే అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement