Friday, March 29, 2024

నేటి నుంచి కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మకు ఆషాఢ మాస తొలి సారెను దేవస్థానం తరపున వైదిక కమిటీ, దేవస్థానం ఉద్యోగులు ఆదివారం సమర్పిస్తారని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఉదయం 7 గంటలకు స్థానాచార్య శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో అర్చక సిబ్బంది. అమ్మవారికి తొలి సారెను సమర్పిస్తారని తెలిపారు.

ఈ నెల 11 నుంచి ఆగస్టు 8 వరకు ఆషాఢ సారెను సమర్పించే భక్తులు, ధార్మిక సంస్థలు మూడు రోజులు మందుగా దేవస్థానం అధికారులకు తెలియజేయాలని కోరారు. ఆఫీసు వేళల్లో దేవస్థానం ఫోను నెంబర్లు 9493545253, 8341547300ల‌కు ఫోను చేసి ఎక్కడి నుంచి సారెను తీసుకువస్తున్నది. భక్తుల సంఖ్య , ఏ తేదీ సమర్పించేది త‌దిత‌ర వివరాలను ముందుగా నముదు చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించి దేవస్థానం అధికారులకు సహకరించాలని కోరారు.

ఈ వార్త కూడా చదవండి: భాగ్యనగరంలో బోనాల సందడి

Advertisement

తాజా వార్తలు

Advertisement