Saturday, April 27, 2024

క‌ల్యాణ్ రామ్ పుట్టిన రోజు… ‘డెవిల్స్’ గ్లింప్స్ తో అభిమానుల‌కు గిఫ్ట్

YouTube video

కల్యాణ్ రామ్ తాజాగా న‌టిస్తున్న మూవీ ‘డెవిల్స్’ . ‘ది బ్రీటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. అభిషేక్ పిక్చర్స్ ర్మిస్తున్న ఈ సినిమాకి, నవీన్ మేడారం దర్శకుడు. ఈరోజు కల్యాణ్ రామ్ బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు అదే గూఢచారి కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అనే డైలాగ్ తో గ్లింప్స్ ప్రారంభై ఆస‌క్తి క‌లిగిస్తున్న‌ది.. బ్రిటీష్ కాలంలో నడిచే కథకి సంబంధించిన సన్నివేశాలతో వదిలిన ఈ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 1945 ప్రాంతంలో ఈ కథ మొదలై .. ప్రస్తుత కాలానికి కనెక్ట్ అవుతుంది.

శ్రీకాంత్ విస్సా క‌థ‌ను అందించ‌గా, . హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.. ఈ సినిమాలో సంయుక్త మీనన్ – మాళవిక నాయర్ లు క‌థ‌నాయిక‌లు. 500 మంది ఫైటర్స్ తో చిత్రీకరించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement