Friday, April 26, 2024

క‌ళ్యాణ్ రామ్ మూవీ డెవిల్.. షూట్ కంప్లీట్

డెవిల్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది.ఈ చిత్రంలో హీరోగా కళ్యాణ్‌రామ్ న‌టిస్తున్నాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్‌ నటిస్తుంది. ఈ సినిమాను ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. నవీన్‌ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్‌ పనులను స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. పీరియాడిక్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1945 టైమ్‌లో జరుగునుంది. బ్రిటీష్‌ వాళ్లు పాలిస్తున్న సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ రహస్య గూఢాచారిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమానూ అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement