Tuesday, April 30, 2024

ఐ ల‌వ్ సౌత్ – కాజ‌ల్ అగ‌ర్వాల్

సినిమాల నిర్మాణంలో ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దక్షిణాదిలో పక్కాప్లానింగ్‌తో చిత్ర నిర్మాణం జరుగు తుంటుంది. ఆర్టిస్టులకు ఇచ్చే గౌరవం కూడా ఎక్కువే. అందుకే దేశంలో ఎక్కువ సినిమాలు నిర్మాణం అవుతుంటాయి. అలాంటి దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి సీనియర్‌ నటి కాజల్‌ మంచి సర్టిఫికెట్‌ ఇచ్చింది. అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన కాజల్‌కు ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి. ఆమె మాతృభాష హిందీ అయినప్పటికీ, పేరు తెచ్చుకుంది, డబ్బు సంపాదించుకుంది మాత్రం దక్షిణాదిలోనే

. ఇటీవలే ఓ వార్తాసంస్థకు ఇంటర్య్వూ ఇస్తూ తను హిందీ సినిమాల కంటే దక్షిణాది చిత్రాల్లోనే నటించేందుకు ఇష్టపడతానని స్పష్టం చేసింది. దీనికి కారణం కూడా చెప్పింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో క్రమశిక్ష, నైతిక విలువలు ఇష్టమనే పేర్కొంది. ఇవి హిందీ పరిశ్రమలో లోపించాయని చెప్పింది. స్నేహ పూర్వక వాతావరణం కూడా దక్షిణాదిలోనే ఉంటుందని తెలిపింది. ఇప్పుడు అద్భుతమైన చిత్రాలు ఇక్కడ నుండి వస్తున్నాయని చెప్పింది. కాజల్‌ ఇలా స్పందించడం పట్ల బాలీవుడ్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు తెలుగు, తమిళ సినిమాల నుండి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. తన ప్రకటన వల్ల హిందీ సినిమాలు తగ్గుతాయని ఆమె భావించడం లేదని సన్నిహితులు అంటున్నారు. కాజల్‌ ఇప్పుడు బాలకృష్ణ, కమల్‌హాసన్‌ చిత్రాల్లో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement