Tuesday, April 30, 2024

నాగ్ తో రొమాన్స్ చేయనున్న కాజల్

అక్కినేని నాగార్జున వరుస సినిమాలను లైన్ లో పెడుతూ స్పీడ్ పెంచుతున్నాడు. ఇప్పటికే వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రవీణ్ సత్తారు తో సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాలో నాగ్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. మార్చి 31 నుంచి హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటించబోతోంది. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు నాగ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. తొలిసారిగా ఈ ఇద్దరు జతకట్టబోతున్నారు. ఇక కాజల్ విషయానికి వస్తే కాజల్ నటించిన మోసగాళ్లు సినిమా 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement