Thursday, May 2, 2024

ప్రభాస్ కు విలన్ గా జాన్ అబ్రహం ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈచిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాపై మరింత క్రేజ్ ను తీసుకువచ్చేందుకు ప్రశాంత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడట.

అందుకే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ను విలన్ పాత్రలో చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా జాన్ అబ్రహం కూడా అందుకు ఒప్పుకుంటాడని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ విషయానికి సంబంధించి ఎక్కడా కూడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ అదే కనుక నిజమైతే సలార్ రేంజ్ మరింత పెరిగినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement