Tuesday, May 7, 2024

వరుసగా నాలుగోసారి!! మోహన్ లాల్ తో మరో సినిమా

మలయాళ హీరో మోహన్ లాల్, అలాగే డైరెక్టర్ జీతూ జోసెఫ్ పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే చిత్రం దృశ్యం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించడంతో దృశ్యం2 కూడా తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా అదే తరహాలో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అలాగే ప్రస్తుతం రామ్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కూడా డైరెక్టర్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమా ఇద్దరు చేయబోతున్నారు. ఈ సినిమాకు 12th మ్యాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈమేరకు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement