Sunday, May 5, 2024

Special song : రామ్ చ‌ర‌ణ్ తో జాన్వీ క‌పూర్ స్పెష‌ల్ సాంగ్

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో ఈ ఐటమ్ సాంగ్ ని చేయిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తోంది. దీనికోసం ఇప్ప‌టికే సంప్ర‌దింపులు చిత్ర యూనిట్ జ‌రిపింది.. హీరోయిన్ రేంజ్ లో పారితోషికం కూడా ఆఫ‌ర్ చేశారు.. దీనికి ఆమె ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement