Monday, May 6, 2024

జాన్వీ కపూర్‌కి టాలీవుడ్‌లో రెండో ఆఫర్?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్ ఈ నెలాఖరున షూట్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు, జాన్వీ కపూర్ త్వరలో తన రెండవ తెలుగు సినిమాకి సంతకం చేయనుందని సినీ సర్కిల్ లో వార్తలు హల్ చల్ అవుతున్నాయి. మరో తెలుగు టీమ్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే, ఆమె రెండో తెలుగు సినిమా ఏంటనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. రామ్ చరణ్‌తో తన సినిమా కోసం బుచ్చిబాబు సనా బృందం ఆమెను సంప్రదించిందా లేదా రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ఆమెను కాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడా అనేది మనం వేచి చూడాలి. జాన్వీ కపూర్ తన మొదటి సినిమా చిత్రీకరణ ప్రారంభించకముందే తెలుగులో పాపులర్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement