Sunday, October 13, 2024

‘దసరా’తో తన సత్తా చాటిన శ్రీకాంత్…. క్యూ కడుతున్న సినిమా ఆఫర్లు

టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ ఓదెల్. దసరా సినిమాతో తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా తన మార్కును చాటాడు ఈ యువ డైరెక్టర్. ఈ సినిమా ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్కును అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. నేచురల్ స్టార్ నానితో తీసిన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తొలి సినిమాతోనే అరుదైన ఘనత సాధించాడు శ్రీకాంత్. దీంతో ఈ యువ డైరెక్టర్ కి సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఫిల్మ్ వర్గాల సమచారం మేరకు శ్రీకాంత్‌కు అక్కినేని కుటుంబం నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. అఖిల్ అక్కినేనితో సినిమా చేసేందుకు అతడికి అవకాశం వచ్చిందని. ఇప్పటికే సినిమా గురించి సంప్రదింపులు కూడా నడిచాయని. శ్రీకాంత్‌ అఖిల్‌కు కథ చెప్పడమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఏజెంట్ నుంచి అఖిల్ ఫ్రీ అయితే శ్రీకాంత్‌తో సినిమా గురించి చర్చలు జరుగుతాయని సమాచారం. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement