Tuesday, April 30, 2024

తండ్రి తానే…కొడుకుతానే…చెర్రీ కోరిక శంకర్ తీర్చుతాడా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మామూలుగా శంకర్ సినిమాలు అంటేనే ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా అనగానే అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమా సబ్జెక్టు మొత్తం పొలిటికల్ డ్రామా, అలాగే తండ్రి కొడుకుల కథ అని కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా శంకర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కోరిక కోరాడట. కొడుకు పాత్ర తో పాటు తండ్రి పాత్రను కూడా తానే చేస్తానని చెప్పాడట. దీంతో రామ్ చరణ్ కోరికమేరకు శంకర్ 50 ఏళ్ల తండ్రి పాత్రకు లుక్ టెస్ట్ రెడీ చేసాడట. అందులో గనుక రామ్ చరణ్ శంకర్ ను మెప్పించగలిగితే ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్లో చెర్రీ కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement