Monday, April 29, 2024

సలార్ లో శృతిహాసన్ పాత్ర ఇదే ?

కే జి ఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ 2 తోపాటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం శృతిహాసన్ నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొనబోతుందట. కాగా ఈ సినిమాలో ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతుందని… అలాగే ఆమె పాత్రకు సంబంధించిన ఓ ట్విస్ట్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.

కాగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడట. 2021 కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈసినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement