Thursday, May 2, 2024

బాలయ్య భార్యగా పూర్ణ ఇదే ఫైనల్ ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమా అఖండ. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. మరోవైపు ఈ సినిమా సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో స్థాయిలో దూసుకుపోతోంది. ఇక అలాగే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పూర్ణ పాత్ర ఏంటి అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య భార్యగా కనిపించనుందట పూర్ణ . ఆమె పాత్ర నిడివి మాత్రం చాలా తక్కువట. అయితే బాలయ్యతో తొలిసారి అవకాశం రావడంతో ఆమె అంగీకరించిందట. కానీ ఆమె పాత్ర చాలా బాగుంటుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement