Wednesday, May 1, 2024

గోపీచంద్ ‘రామబాణం’ నుంచి ఐఫోన్ లిరికల్ సాంగ్ రిలీజ్

యువ దర్శకడు శ్రీవాస్ దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా డింపుల్ హయతి హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రామబాణం’. జగపతి బాబు, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ పై గోపీచంద్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో మంచి అంచనాలునే ఉన్నాయి. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని అందరిలో ఆ అంచనాలు మరింతగా పెంచాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

కాగా, ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ ప్రోమోని నిన్న రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఐఫోన్ ఫుల్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. మిక్కీ జె మేయర్ మెలోడియస్ ట్యూన్ అందించిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించగా రామ్ మిరియాల, మోహన భోగరాజు అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ యువత తో పాటు శ్రోతలు అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా రామబాణం మూవీని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ కానుకగా మే 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement