Tuesday, April 30, 2024

శివ కార్తికేయన్ “అయాలాన్” నుండి రేపు ఇంట్రెస్టింగ్ అప్డేట్..

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ ప్ర‌స్తుతం చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ అయాలాన్. ఈ మూవీకి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తుండ‌గా.. 2024 సంక్రాంతికి థియేటర్ల‌లో విడుదలకు రెడీ అవుతోంది. ఇక మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

కాగా, ఈ సినిమా నుండి రేపు ఒక అప్డేట్ బయటకు వస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఇక నుంచి సినిమా ప్ర‌మోష‌న్స్ లో మేకర్స్ దూకుడు పెంచనున్న‌ట్టు తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ అయాలాన్ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భాను ప్రియ, యోగి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. KJR స్టూడియోస్‌పై కోటపాడి జె రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement