Monday, April 29, 2024

ఇందువదన మరో బోల్డ్ లుక్

హ్యాపీ డేస్ సినిమా తో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమయ్యారు వరుణ్ సందేశ్. ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం సినిమా తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. అయితే ప్రస్తుతం లాంగ్ గ్యాప్ తర్వాత ఇందువదన అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్ సందేశ్.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. కాగా తాజాగా హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి బోల్డ్ స్టిల్ తో లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లుక్ మరింత గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు నూతన దర్శకుడు ఎం ఎస్ ఆర్ దర్శకత్వం వస్తున్నారు. ఇక లాస్ట్ వీక్ హైదరాబాద్ సారథి స్టూడియోలో వేసిన ఓ భారీ సెట్ లో క్లైమాక్స్ ను షూట్ చేశారు చిత్ర యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement