Saturday, May 4, 2024

రిలీజ్ కి ముందే టాప్10లో.. క‌స్ట‌డీ

రిలీజ్ కి ముందు టాప్ 10లో నిలిచింది క‌స్ట‌డీ చిత్రం. ఈ చిత్రంలో హీరోగా నాగ‌చైత‌న్య న‌టిస్తున్నాడు.ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్‌) ప్రకారం మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ ఇండియన్‌ ఫిలిమ్స్‌ ఆఫ్‌ ది సమ్మర్‌-2023లో కస్టడీ టాప్‌ 10లో నిలిచింది.కాగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఛత్రపతి మే 12న విడుదలవుతుంది. ఈ చిత్రం ఐఎండీబీ జాబితాలో ఐదో స్థానంలో నిలువగా.. తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్‌ 9వ స్థానంలో నిలిచింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వస్తోన్న కస్టడీని వెంకట్ ప్రభు డైరెక్ట్‌ చేస్తున్నారు. NC 22గా తెరకెక్కుతున్న కస్టడీ గ్లింప్స్ వీడియో, టీజర్‌ టీజ్‌ను ఇప్పటికే లాంఛ్ చేయగా.. నెట్టింట్లో హల్‌ చల్ చేస్తున్నాయి. కస్టడీలో నాగచైతన్యకు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి నటిస్తోంది. ఈ మూవీలోపోలీసాఫీసర్‌ శివగా చైతూ కనిపించబోతున్నారు.యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న కస్టడీ మే 12న విడుదల కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement