Sunday, April 28, 2024

Prabhas : ఎన్ని సార్లు వాయిదా వేస్తావ్ డార్లింగ్ ..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు డార్లింగ్.. ఇక ఈ ఏడాది ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాను మొదటగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు… అయితే ఏపీలో ఎన్నికల కారణంగా సినిమాను వాయిదా వేయ‌నున్న‌ట్లు తాజా టాక్.

- Advertisement -

సినిమాని 30వ తేదీ రిలీజ్ చేసేందుకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ విలన్‌గా కనిపించనున్నాడని అంటున్నారు. దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని అశ్వినీదత్ వైజయంతి సినిమాస్ బ్యానర్ పై తెరకేక్కుతుంది..

ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కిస్తున్నారు. .సైన్స్, పురాణాలు కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాక యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement