Friday, May 3, 2024

రాధే శ్యామ్ కు ఎన్ని అడ్డంకులో ?

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. కానీ అనుకోకుండా కరోనా మహమ్మారి కారణంగా ఈ షూటింగ్ ను నిలిపివేశారు.

మొదట రెండు వారాల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలని భావించినప్పటికీ అది కుదిరేలా కనిపించట్లేదు. దీంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కాబట్టి రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement