Sunday, April 28, 2024

బాలయ్య పాజిటివ్ పర్సన్ – ప్రగ్యా

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ రిసార్టులో జరుగుతోంది. బాలకృష్ణ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పై సన్నివేశాలను షూట్ చేస్తున్నారు

ఈ నేపథ్యంలోనే ప్రగ్యా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ… బాలకృష్ణ పాజిటివ్ పర్సన్. ఆయనతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ అమేజింగ్ అంటూ చెప్పుకొచ్చింది ప్రగ్యా. కరోనా నేపథ్యంలో కెమెరా ముందుకు వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని సమయాలలో మాస్కు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ పూర్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే జగపతిబాబు శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement