Sunday, May 19, 2024

Nushrat Bharucha: ఈ హీరోయిన్ కు చెప్పులు పిచ్చి…

షూస్, చెప్పుల సేక‌ర‌ణ‌లో అరుదైన రికార్డ్ నెల‌కొల్పింది గ్లామ‌ర‌స్ హీరోయిన్ నుష్ర‌త్ భారూచా. ప్యార్ కా పంచ్‌నామా స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన‌ బాలీవుడ్ నటి నుష్రత్ బరుచ్చా అభిమానులందరికీ తన షూ సేక‌ర‌ణ వివ‌రాల‌ను షేర్ చేసింది.

త‌న‌ ఇంట్లో శుభ్రపరిచే స‌మ‌యంలో తన గదిలో నేలపై ఉంచిన పాదరక్షలపై తనకున్న విపరీతమైన ప్రేమను వెల్లడించింది. నుష్రత్ భరుచ్చా తన ఇన్‌స్టాగ్రామ్ లో తన బూట్ల ఫోటోని షేర్ చేసింది .

- Advertisement -

ప్ర‌స్తుతం నుష్ర‌త్ భారూచా షూఫ్యాక్ట‌రీపై నెటిజ‌నుల్లో చెణుకులు ప‌డుతున్నాయ్. 2023లో నుస్ర‌త్ నాలుగు సినిమాల్లో న‌టించింది. అక్ష‌య్ స‌ర‌స‌న సెల్ఫీ చిత్రంలో న‌టించిన నుస్ర‌త్, బ్లాక్ బ‌స్ట‌ర్ తూ జూతి మై మ‌ర‌క్క‌ర్ లో కామియోలో క‌నిపించింది. ఛ‌త్ర‌ప‌తి చిత్రంలో స‌ప్నాగా న‌టించింది. అకేళి అనే చిత్రంలోను నుష్ర‌త్ న‌టించింది. చిచోర్ చిత్రంలో న‌టించిన నుష్ర‌త్ ఇప్పుడు సీక్వెల్ చిచోర్ 2లోను న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement