Saturday, April 27, 2024

26 క్యారెట్ గోల్డ్ నువ్వు….దేవరకొండపై ఛార్మి ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాను ఛార్మి నిర్మిస్తున్నారు. అయితే ఆదివారం విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఛార్మి అతని గురించి ఓ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నీ గురించి చెప్పడానికి ఒక లైన్ అని…చెప్తూనే నువ్వు బంగారం.. 26 క్యారెట్ గోల్డ్ అంటూ విజయ్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఛార్మి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇక లైగర్ సినిమా లో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన తన లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

https://www.instagram.com/p/COpnfnHseFx/?igshid=hii3ih5bgcmi

Advertisement

తాజా వార్తలు

Advertisement