Thursday, May 2, 2024

రేంజ్ రోవ‌ర్ కొన్న య‌ష్.. ఎన్ని కోట్లో తెలుసా

ఆ ఒక్క సినిమా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది హీరో య‌ష్ ని. కేజీఎఫ్ సిరీస్ ల‌తో ఆయ‌న రేంజ్ మారిపోయింది. సినిమాల‌తో పాటు పలు ప్రతిష్టాత్మక బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు య‌శ్. అందుకు తగ్గట్టుగా అతని లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. యశ్ ఇంటికి కొత్త లగ్జరీ కారు వచ్చింది. రేంజ్ రోవర్ కారును యశ్ తాజాగా కొనుగోలు చేశారు. తన భార్య రాధిక పండిట్‌.. పిల్లలు యథర్వ్‌, ఐరాతో కలిసి కొత్త కారుతో ఫోటోలు దిగాడు యశ్. ప్రజంట్ ఆ కారు ధర ఎంత అని అభిమానులు కూడా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. కొత్త కారు కొన్నందుకు అందరూ యశ్‌కు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ కొత్త రేంజ్ రోవర్ కారు ధర 4 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. దానిలో ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయట. యష్ కొత్త సినిమా ఇంకా సెట్ కాలేదు. అతని 19వ సినిమాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement