Sunday, May 5, 2024

TS Lawcet : ఫ‌లితాలు విడుద‌ల‌.. లాసెట్ లో 78.59 శాతం ఉత్తీర్ణ‌త‌

హైద‌రాబాద్ : తెలంగాణ‌ లాసెట్, పీజీ ఎల్‌సెట్‌-2023 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి గురువారం విడుద‌ల చేశారు. లాసెట్‌(మూడేళ్ల ఎల్ఎల్‌బీ)లో 78.59 శాతం ఉత్తీర్ణ‌త‌, లాసెట్(ఐదేండ్ల ఎల్ఎల్‌బీ)లో 80.21 శాత్తం ఉత్తీర్ణ‌త‌, పీజీ ఎల్‌సెట్‌(ఎల్ఎల్ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైన‌ట్లు వెల్ల‌డించారు. లాసెట్ ఫ‌లితాల కోసం https://lawcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement