Monday, April 29, 2024

వ‌రుణ్ తేజ్ బ‌ర్త్ డే – గ‌ని అప్ డేట్

నేడు మెగా హీరో వ‌రుణ్ తేజ్ బ‌ర్త్ డే. వ‌రుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో గ‌ని సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా లో జ‌గ‌ప‌తి బాబు, సునీల్ శెట్టి, ఉపెంద్ర‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. అలాగే సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సంద‌ర్భంగా గ‌ని చిత్రం నుంచి అప్ డేట్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప‌వ‌ర్ ఆఫ్ గ‌ని అనే పేరుతో ప్ర‌త్యేక వీడియోని చేసి రిలీజ్ చేసింది. ఈ సంద‌ర్భంగా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ వీడియో లో వ‌రుణ్ తేజ్ రింగ్ లో ప్ర‌త్య‌ర్థుల‌పై పంచ్ వేస్తు బాక్స‌ర్ గా క‌నిపిస్తున్నాడు. 28 సెక‌న్లు మాత్ర‌మే ఉన్న ఈ వీడియో వ‌రుణ్ తేజ్ పంచ్ ల వ‌ర్షం క‌నిపిస్తుంది. చివ‌రిలో సీరియ‌స్ లుక్ లో ఉన్న వ‌రుణ్ తేజ్ ను చూస్తే.. నిజ‌మైన బాక్స‌ర్ ల కనిపిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఎఫ్3 చిత్రంలో కూడా వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement