Thursday, April 25, 2024

Criminal: పెళ్లి చేసుకుంటానని మహిళపై అఘాయిత్యం.. ఫేమస్ యూట్యూబర్ పై రేప్‌ కేసు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేరళ సెలబ్రిటీ యూట్యూబర్ శ్రీకాంత్ వెట్టియార్ పై కేసు నమోదైంది. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొచ్చి సెంట్రల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఓ హోటల్‌, అపార్ట్ మెంట్‌లో తనపై రెండుసార్లు దారుణంగా అత్యాచారం చేశారని ఫిర్యాదులో నిందితురాలు పేర్కొంది.

కాగా, శ్రీకాంత్ వెట్టియార్ ఫేమస్ సినిమాల స్పూఫ్ వీడియోలకు ప్రసిద్ధి చెందిన యూట్యూబర్ గా పేరుగాంచారు. అయితే.. ఆ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం మహిళా సాధికారత, రాజకీయ సమానత్వం వంటి సమస్యలపై వెట్టియార్ పోస్టు చేసిన వీడియోలకు తాను అట్రాక్ట్ అయ్యానని ఆ మహిళ పేర్కొంది. పిటిషనర్ ఎనిమిదేళ్ల బాలుడికి తల్లి.. ఆమె కొచ్చిలో నివసిస్తున్నప్పుడు శ్రీకాంత్ వెట్టియార్‌తో సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది.

2021 ఫిబ్రవరిలో జరిగిన శ్రీకాంత్ వెట్టియార్ పుట్టినరోజు వేడుకకు తనను ఆహ్వానించారని.. ఎర్నాకులంలోని అలువాలోని ఫ్లాట్‌లో, ఆ తర్వాత కొచ్చి సిటీలోని హోటల్ గదిలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని శ్రీకాంత్ వెట్టియార్ తన స్నేహితులను బెదిరింపులకు పాల్పడుతున్నాడని, పదే పదే ఒత్తిడి చేశారని బాధితురాలు ఆరోపించింది.

- Advertisement -

శ్రీకాంత్ వెట్టియార్‌పై ‘విమెన్ ఎగైనెస్ట్ సెక్సువల్ హరాస్‌మెంట్’ అనే ఫేస్‌బుక్ పేజీ గతంలో రెండు #మీటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement