Sunday, April 28, 2024

రీఎంట్రీకి షురూ… స్టైలిష్ లుక్ లో తరుణ్

నువ్వేకావాలి సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు తరుణ్. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో మెప్పించిన తరుణ్… తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చి నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను… వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. కాగా ఆ తర్వాత వరుస పరాజయాల కారణంగా సినిమాలకు దూరం అయ్యాడు. ప్రస్తుతానికి బిజినెస్ చేసుకుంటూ లైఫ్ ని కూల్ గా ముందుకు నడిపిస్తున్నాడు.

అయితే ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన స్నేహితుడు చెప్పిన ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో తరుణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం చిత్రయూనిట్ ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తరుణ్ స్నేహితుడు పరిచయం కాబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement