Saturday, May 4, 2024

ఎద్దులతో ఆటాడుతున్న సూర్య @వాడి వాసల్

తమిళ్ స్టార్ హీరో సూర్య మొదటి నుంచి కూడా ఉంది డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇదిలా ఉండగా సూర్య ప్రస్తుతం వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ కూడా చేస్తున్నాడు.

ఈ సినిమా జల్లికట్టు నేపధ్యంలో తెరకెక్కబోతుంది. అయితే ఎద్దులతో పోరాడే సన్నివేశాలు సహజంగా ఉండాలనే నేపథ్యంలో సూర్య ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. అలాగే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు కూడా తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిర్మాత కలై పులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ కూడా పక్క మాస్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి చూడాలి సూర్య ఈ సినిమాతో ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తాడో.

Advertisement

తాజా వార్తలు

Advertisement