Monday, May 6, 2024

సుధీర్ బాబు 15వ చిత్రం – డైరెక్ట‌ర్ ఎవ‌రంటే

హాస్య న‌టుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ డైరెక్ష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు న‌టిస్తున్నాడు. సుధీర్ బాబుకి ఇది 15వ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించిన వ‌ర్కింగ్ ఫొటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్, ఎల్ఎలీపీ ప‌తాకం పై నారాయ‌ణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహ‌న్ రావు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ షూటింగ్ ను హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ప్రారంభించారు. కాగ ఈ సినిమా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతుంద‌ని సినిమా నిర్మాతలు తెలిపారు. హీరో సుధీర్ బాబు కోసం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ భిన్న మైన కథను రూపొందించారట‌. సుధీర్ బాబు ఈ సినిమా డిఫ‌రెంగ్ పాత్ర‌లో ప్రేక్ష‌కులకు క‌నిపిస్తార‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement