Friday, May 10, 2024

గల్లీ రౌడీ టీజర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

సందీప్ కిషన్ హీరోగా స్నేహ శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం గల్లీ రౌడీ. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ సోమవారం విడుదలైంది. ఈ టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 2.22 నిమిషాల నిడివితో రిలీజైన ఈ టీజర్ ఆద్యంతం పంచ్ డైలాగ్ లతో సాగింది. ఇక చిత్ర నిర్మాత ఎంవివి సత్యనారాయణ గత చిత్రాలలో గెస్ట్ రోల్ లో కనిపించినట్టే ఇందులోనూ కనిపించారు.

ఇక బాబీ సింహ ,రాజేంద్రప్రసాద్, వైవా హర్ష, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పక్క కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement