Saturday, April 27, 2024

థాంక్యూ బ్రదర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చైతు

అక్కినేని నాగచైతన్య సాయంత్రం ఐదు గంటలకు ఓ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అంటూ ఆహా సంస్థ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అందరు లవ్ స్టోరీ సినిమా పై అనౌన్స్మెంట్ చేయబోతున్నాడని భావించారు. కానీ నాగ చైతన్య థాంక్యూ బ్రదర్ రిలీజ్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అనసూయ భరద్వాజ్ అశ్విన్ విరాజ్ జంటగా రమేష్ రాపర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ బ్రదర్. ఇక ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చైతు చెప్పుకొచ్చారు.

ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్నట్లు ప్రకటించారు. అలాగే దర్శకుడిగా పరిచయం అవుతున్న రమేష్ రాపర్తి కి యూనిట్ కి అభినందనలు తెలిపారు చైతు. ఇక ఈ సినిమాలో అర్చన, వైవా హర్ష, అనిల్ కురువిల్లా, అన్నపూర్ణ, మౌనిక రెడ్డి, ఆదర్శ్, కాదంబరి కిరణ్ సమీర్ ముఖ్య పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement