Friday, March 29, 2024

పుష్ప లో రష్మిక పాత్ర ఇదే ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గంధపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లో రష్మిక మందన్న ను పరిచయం చేశాడు దర్శకుడు. అయితే రష్మిక పాత్ర పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక డీగ్లామర్ రోల్ లో కనిపించనుందట. ఇంటర్వెల్ ముందు ఆమె పాత్ర కు సంబంధించి ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందట. విలన్ తరఫున వచ్చిన అకౌంటెంట్ గా రష్మిక రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ రౌటేలా కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement