Thursday, April 25, 2024

మైక్ టైసన్ లా మారిన హ్యపీడేస్ టైసన్..

హ్యాపి డేస్ సినిమా చూసిన వారందరికి మైక్ టైసన్ అనే పేరు అందరికి తెలిసిందే..14 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్‌. ఈ సినిమాలో జనాలకు బాగా కనెక్ట్‌ అయిన పాత్ర టైసన్‌. అదిరిపోయే డైలాగ్‌లతో, రివర్స్‌ పంచులతో టైసన్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్‌. ఇందులో అతడు మరీ బక్కగా ఉండటంతో అందరూ అతడిని వెటకారంగా టైసన్‌ అని ఆటపట్టిస్తుంటారు. కానీ ఇప్పుడు రాహుల్‌ గుర్తుపట్టకుండా మారిపోయాడు.  కండలు తిరిగిన దేహం, మీసకట్టుతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అతడిని ఈ గెటప్‌లో చూసిన అభిమానులు అసలు ఆ టైసన్‌ నువ్వేనా? అని షాకవుతున్నారు. నిన్ను అసలు గుర్తుపట్టలేకపోతున్నాం, మాస్‌ చేంజ్‌ ఓవర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. శ్రావ్స్‌ నిన్ను చూస్తే ఫ్లాట్‌ అయిపోద్ది అన్నా.. అంటూ ఫన్నీగా మెసేజ్‌ చేస్తున్నారు.

u
Advertisement

తాజా వార్తలు

Advertisement